వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి 

– విద్యుత్తు నల్లికుదురు సబ్ స్టేషన్ ఏఈ సింధు 
– మునిగిల వీడు సబ్ స్టేషన్ ఏఈ భార్గవి 
నవతెలంగాణ – నెల్లికుదురు
వర్షాకాలంలో విద్యుత్తు సంబంధించిన కోళ్లను కానీ వైర్లను కానీ ముట్టుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లికుదురు మండల విద్యుత్తు ఏఈ సింధు మునిగిలవీడు ఏఈ భార్గవి ప్రజలను కోరారు ఆదివారం కురిసిన వర్షాలకు గ్రామాలను పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని మునగల వీడు సబ్ స్టేషన్ పరిధిలో 11 డి టి ఆర్ లు నీళ్లలో మునిగిపోయాయని అన్నారు 11 కెవి సంబంధించిన విద్యుత్తు పోలు 15 పైకి విరిగిపోయాయని అన్నారు 33 కెవి సంబంధించిన బంజర స్టేజి వద్ద విరిగిన పోలను వెంటనే ఒక విద్యుత్ పోరును వేస్తున్నామని అన్నారు. నెల్లికుదురు ఏ ఈ సింధు మాట్లాడుతూ రత్తి రామ్ తండా  గ్రామంలో 11 పోలు విరిగాయని బ్రాహ్మణ కొత్త పెళ్లి గ్రామంలో మూడు స్తంభాలు విరిగాయని మేచరాజ్ పల్లి గ్రామంలో ఒక డిటిఆర్ 33 కెవి 25 కెవి నీళ్లలో మునిగిపోయాయని తెలిపారు ఇంకా తెలియాల్సింది ఉందని అన్నారు మా విద్యుత్తు సంబంధించిన సిబ్బంది పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఏది ఏమైనప్పటికీ రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు అవి తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు. రైతులు తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు. విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ప్రజలు ముట్టుకోరాదు.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయవలెను.పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి. కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.క్వార్టర్ లలో ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.గాలి,దుమారం,వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు. .ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసివేయవలెను.వర్షం పడుచున్నప్పుడు టీవీ,ఫ్రిడ్జ్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను, లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్  అయ్యే అవకాశం ఉంటుంది.కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు. ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన అధికారి విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరుతూ నట తెలిపారు