అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

– ఫైర్ అధికారి జే మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ – ఆర్మూర్
వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ అగ్ని మాపక కేంద్ర అధికారి జే మధుసూదన్ రెడ్డి మంగళవారం తెలిపారు. షాపింగ్ మాల్ దుకాణాలు బందు చేసేటప్పుడు ఇంవేటర్స్ ,మెయిన్ స్విచ్లు ఆఫ్ చేసుకోవాలని, ఇళ్లల్లో ఏసీ కూలర్లు ఆఫ్ చేసి ఉంచుకోవాలని, షార్క్ సర్క్యూట్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ,గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసుకుని వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బహుళ అంతస్తులు యందు ,అపార్ట్మెంట్ల యందు షార్క్ సర్క్యూట్ జరిగినప్పుడు లిఫ్ట్ ఉపయోగించకుండా మెట్ల మార్గాన రావాలని సూచించారు ..అపార్ట్మెంట్లో యందు జి ప్లస్ 4 ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు ఇవ్వవద్దని ,వేసవిలో సరదా కోసం ఈత కొట్టేందుకు గ్రామాల్లోని చెరువులకు వెళ్లినట్లయితే పెద్దలు కనిపెడుతూ ఉండాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పొలాలను తగలబెడుతూ పర్యావరణ పరిరక్షణ దెబ్బతీయడమే కాకుండా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ,పశు గ్రాసంగా ఉపయోగించే గడ్డిని తగలబెట్టకుండా దున్ని ఎరువుగా ఉపయోగించటం మేలని, ఇండ్లలో సైతం అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.