– 18 ఏండ్లుపైబడిన 96 మిలియన్ల మందిలో…
– నివారణకు జాగ్రత్తలు తీసుకుంటే షుగర్‌కు దూరం
నవతెలంగాణ-సిటీబ్యూరో
డయాబెటీక్ లేదా షుగర్ భారతదేశాన్ని పీడిస్తున్న వ్యాధుల్లో ముఖ్యమైన వ్యాధి. అయితే చాలా మందిలో ప్రిడయాబెటిక్ ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో యువతలో ప్రిడ యాబెటిక్ కేసులు పెరుగుతున్న డాక్టర్లు చెబుతు న్నారు. 2019 లెక్కల ప్రకారం… 18 ఏండ్లు పైబడి న 96 మిలియన్ల మందిలో ప్రిడయాబెటిక్ ఉన్నట్టు కనుగొన్నారు. డయాబెటీస్ ఒకసారి వస్తే దాన్ని నివారించలేం. జీవితాంతం మందులు వాడాల్సిందే. కానీ ప్రిడయాబెటిక్ అలా కాదు. దాన్ని గుర్తిస్తే నివారించడంతో పాటు భవిష్యత్తులో షుగర్ రాకుండా చికిత్స తీసుకునేందుకు వీలుంది. దీని పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ప్రిడయాబెటిక్ నుంచి డయాబెటిక్ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనారోగ్యకరమైన భోజనం, చలనం లేని జీవనశైలి ప్రీడయాబెటిక్ రావడానికి ఎక్కువగా కారణమవుతున్నదని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డా.బి.ఆశిష్ రెడ్డి తెలిపారు. సాధారణ రక్త పరీక్ష ద్వారా ప్రిడయాబెటిక్ నిర్దారించవచ్చని చెప్పారు. ఆరోగ్యకరమైన బరువు, సమతుల్యమైన భోజనం తినడం, సాధారణ శారీరక వ్యాయామం, ఎలివేటర్ బదులు మెట్లు ఎక్కడం వంటి చిన్న, చిన్న మార్పుల ద్వారా డయాబెటీస్ పెరిగే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని సూచించారు. తాజా పండ్లు, కూరగాయులు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు.