యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదన్‌

న్యూఢిల్లీ : జాతీయస్థాయి పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన తరుణంలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కొత్త చైర్‌పర్సన్‌ ప్రీతి సుదన్‌ నియమితులయ్యారు. నేడు ఆమె బాధ్యతలను స్వీకరించనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా ఉన్నారు. చివరగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ప్రీతి సుదన్‌.. 2020 జులైలో పదవీ విరమణ చేశారు. ఈమె 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ఈ నెల ప్రారంభంలో వ్యక్తిగత కారణాలతో యూపీఎస్సీ చైర్మెన్‌ పదవికి మనోజ్‌ సోనీ రాజీనామా చేసిన విషయం విదితమే. పదవీకాలం ముగియటానికి ముందే.. మనోజ్‌ సోనీ తన బాధ్యతల నుంచి తప్పుకోవటంతో యూపీఎస్సీ చైర్మెన్‌ పదవీ నియామకం అనివార్యమైంది.