– రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
అసంఘటిత రంగంలోని గర్బిణీలకు మెటర్నటీ లీవ్ కింద పెయిడ్ హాలీడేస్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు కే ఆర్ సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును శుక్రవారం ప్రవేశ పెట్టారు. సంఘటిత రంగంలో మాదిరిగానే.. అసంఘటిత రంగంలో గర్బీణీలకు ఎనిమిది లేదా 12 వారాల పెయిడ్ హాలీ డేస్ ఇవ్వాలని బిల్లులో పొందుపరిచారు. డెలివరీకి నాలుగు వారాల ముందు, డెలివరీ తర్వాత 8 వారాలు పెయిడ్ లీవ్స్ ఇవ్వాలన్నారు. దీంతో పుట్టబోయే బిడ్డ, తల్లికి పౌష్టికాహారం తీసుకోవడంలో ఆర్థిక సహాయం దోహదపడుతుందన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయనీ, దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాల్సి ఉందని అన్నారు.