
నవతెలంగాణ – డిచ్ పల్లి
గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పాటించాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి అన్నారు. బుదవారం డిచ్ పల్లి మండలం లోని యానంపల్లి గ్రామంలోని రైతు వేదికలో మండల స్థాయి పోషణ పక్వడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రసూల్ బి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పాటించాలని అన్నారు. ప్రత్యేకించి ఫ్రీస్కూల్ నిర్వహణ, బాలింతలు ఆరోగ్యలక్ష్మి భోజనం కు తప్పకుండా హాజరు కావాలని సూచించారు. పిల్ల తల్లిదండ్రులు పోషకాహారాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం సామూహిక శ్రీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్చి సీడీపీఓ స్వర్ణలత, సూపరవైజర్లు సరిత, సునీత, శోభ, రాధాలక్ష్మి, వరలక్ష్మి, శ్రీ ప్రియ , బుజ్జి, భాగ్య లక్ష్మి,పోషణ్ అభియాన్ జిల్లా కో-ఆర్డినేటర్ రాంబాబు, రంజిత్, యనంపల్లి సెక్రటరీ కిరణ్ కుమార్ తో పాటు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.