గర్భిణులకు సమతుల ఆహారం అవసరమని, తద్వారా శక్తి, రక్షణ ఉంటుందని, ఇదే కాకుండా పుట్టబోయే బిడ్డకు మంచి పోషకాలు అందుతాయని అంగన్వాడీ కార్యకర్తలు అసిఫ, శారదా, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీ అన్నారు.గురువారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో పోషణ అభియాన్ పోషణ మాసంలో భాగంగా పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు నిర్వహించి పిల్లలకు అన్నప్రాసన, సాముహిక అక్షరాభ్యాసం చేసిన అనంతరం అవగాహన కల్పించారు. ఈ గర్భిణులు విటమిన్ లోపం వల్ల వచ్చే అనర్థాలను అర్ధం చేసుకుని తక్కువ ఖర్చుతో ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలని ఇదే కాకుండా నారింజ పండ్లను, ఫలాలను, పోషక ఆహార పదార్థాలు, చిరుధాన్యాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు పిల్లలు పాల్గొన్నారు.