– ప్రజలకు చేసే సేవలో వైద్య సేవ చాలా గొప్పది…
– కార్పోరేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విధ్యను అందించాలి.
– విధుల నిర్వహణలో నిర్టక్ష్యం వహిస్తే సహించేదిలేదు.
నవతెలంగాణ – మునుగోడు
గర్భిణీ స్త్రీలకు అవసరమైతే తప్ప ఆపరేషన్లు చేయొద్దని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహన్ని ఆయన అకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించి రోగులు , బాలింతల రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏఎన్ఎం , ఆశ వర్కర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు దోచుకునేందుకు సాధారణ డెలివరీ కావలసిన గర్భిణీలను ఆపరేషన్ చేసి వేల రూపాయలు దనుకుంటున్నారని అన్నారు. గ్రామాలలో 100 లో 65 మంది గర్భిణీలకు ఆపరేషన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎఎన్ఎంలు, అశాలు సాధారణ డెలివరీ కోసం గర్భిణులకు అవగాహన కల్పించాలి తప్ప ప్రైవేట్ అస్పత్రులు ఇచ్చే కమిషన్ కు కక్కుర్తి పడి ఆరోగ్య సిబ్బంది గర్బిణీలను ప్రైవేట్ ఆసుపత్రి పంపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయని ఆలా జరిగితే వారిపై చర్యలు ఉంటాయన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వైద్య సేవ చాలా గొప్ప సేవ అని అన్నారు.ప్రభుత్వ జీతం తీసుకుంటున్నందుకు ప్రజలకు మేలైన సేవలు అందించాలన్నారు. కరోన సమయంతో వైద్యాధికారుల కంటే ఎఎన్ఎం, ఆశా వర్కర్లుల పాత్ర కీలకమని కొనియాడారు. గ్రామాలలో 13, 14సంవత్సరాల వయస్సు గల విద్యార్ధులే ఎక్కువ గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు అలవాటు పడుతున్నారని, వారిపై ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు ప్రత్యేక శ్రద్ద పెట్టి వారి కదలికలను పరిశీలించి మత్తు భానిసైన విద్యార్ధుల తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్ళాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా విధ్యను అందించి 100శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు . ఎస్సీ బాలుర వసతిగృహం పూర్తిగా శిధిలావస్థకు చేరుకోవడంతో వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలో ఉండే విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక కల్పించాలని మండలాధికారులకు సూచించారు. ఆయన వెంట డిఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎంపిడివో పూజ, తహశీల్దార్ నరేందర్, వైద్యాధికారులు నర్మధ, మాదురి, పంచాయితీ రాజ్ ఎఈ సతీష్ రెడ్డి, ఎంపిఓ, సుపర్వేజర్లు, ఎఎన్ఎం, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గోన్నారు.