– ఐసిడిఎస్ సూపర్వైజర్ మంజులత
నవతెలంగాణ నూతనకల్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందించే పౌష్టిక ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ మంజులత అన్నారు బుధవారం మండల పరిధిలోని చిల్పకుంట్ల అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన సామూహిక స్త్రీమంత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలు అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు సలహాలను పాటిస్తూ మంచి పౌష్టికాహారమైన పదార్థాలను తీసుకుంటూ బిడ్డ క్షేమం కోసం కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బండపల్లి అన్నపూర్ణ ,బత్తుల రేణుక ఏఎన్ఎంలు ఝాన్సీ ఆయమ్మ సోమలక్ష్మి వెంకట మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు