రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. విరించి వర్మ దర్శకుడు. ఈ చిత్రం ఈనెల 8న విడుదలకు రెడీగా ఉంది. ఈ సందర్బంగా మీడియాతో హీరో రాకేష్ మాట్లాడుతూ, ”ఎవరికీ చెప్పొద్దూ’ సినిమా తర్వాత పవర్‌ఫుల్ కంటెంట్‌తో సినిమా చేయాలనుకున్నాను. అందుకే ఈ సినిమా చేశాను. ఈ సినిమాని మే నెలలోనే రిలీజ్ అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడేమో సినిమాని బ్యాన్ చేస్తాం అని అంటున్నారు. కనీసం సినిమాలో ఏం ఉందో కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జితేందర్ రెడ్డి ఒక ఫైటర్. అయన అభిమానులు ఈ సినిమా చూస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. అందుకే కేవలం 75 రూపాయలతో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు. ‘ఈ సినిమాని డైరెక్ట్ చేయడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. జితేందర్ రెడ్డి కథ విన్నాక, ఈ సినిమాకి చాలా పెద్ద స్పాన్ ఉందనిపించింది. ఇది నిజంగా మా నిర్మాత సోదరుడి వాస్తవ జీవితం’ అని దర్శకుడు విరించి వర్మ తెలిపారు. నిర్మాత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ,’ఇలాంటి సినిమా తీశానని తప్తి నాకు ఉంది. నేను ఏదైతే చెప్పాలని అనుకున్నానో దాన్ని మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. జితేందర్ రెడ్డి జీవితం ఒక చరిత్ర. జగిత్యాలలో ప్రీమియర్ వేశాం. చూసిన వాళ్ళలో చాలా మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు’ అని చెప్పారు.