నవతెలంగాణ హైదరాబాద్: పవర్ ట్రాన్స్‌మిషన్ పరిశ్రమలో అగ్రగామిగా పేరుగాంచిన ప్రీమియం సరికొత్త ఉత్పత్తులను ప్రవేశ పెట్టినట్టు ప్రీమియం ట్రాన్స్‌మిషన్ ఎండీ, ప్రెసిడెంట్ నీరజ్ బిసారియా తెలిపారు. ఎక్స్‌సెల్రేటర్ బ్రాండ్ క్రింద పీటీఎక్స్ఎల్ ఫ్లూయిడ్ కప్లింగ్, ఎక్స్ఈ గేర్డ్ మోటార్ అనే రెండు ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 1961లో స్థాపించిన ఈ పరిశ్రమ మారుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రీమియం నిరంతరం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ఉత్పత్తులు పరిశ్రమ ప్రమాణాలను పునర్నిర్వచించగలవని తెలిపారు. ఇన్నోవేషన్ మా ప్రయాణం తాలుకా గుండెలో ఉందన్నారు. సృజన్ 3.0తో పరిశ్రమ అవసరాలను తీర్చడమే కాకుండా వాటిని అంచనా వేయడం, అధిగమించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ప్రీమియం ట్రాన్స్‌మిషన్ ఆరు దశాబ్దాలుగా ప్రపంచ పవర్ ట్రాన్స్‌మిషన్ మార్కెట్‌లో సముచిత స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. వార్మ్ గేర్‌బాక్స్‌లు, హెలికల్ గేర్‌బాక్స్‌లు, ప్లానెటరీ గేర్‌బాక్స్‌లు, గేర్డ్ మోటార్‌లు, ఫ్లూయిడ్ కప్లింగ్‌లను కలిగి ఉన్నామన్నారు. ఇది విస్తృతమైన ఉత్పత్తి శ్రేణిలో శ్రేష్ఠత పట్ల మా నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మా అనుబంధ సంస్థ ప్రీమియం మోషన్ కింద మా పరిధిని విస్తృతం చేస్తున్నామన్నారు. పరిశోధన, అభివృద్ధిపై వ్యూహాత్మక దృష్టితో ప్రీమియం మోషన్ స్లెవ్ డ్రైవ్‌లు, సోలార్ ప్యానెల్ క్లీనింగ్ రోబోట్‌ల వంటి అధునాతన పరిష్కారాలలో ప్రత్యేకతను కలిగి ఉన్నామన్నారు. పరిశ్రమ ప్రమాణాలను పునర్నిర్వచించే వినూత్న పరిష్కారాలను రూపొందించడంలో బాధ్యత వహించడమే మా లక్ష్యమన్నారు.
మీ సపోర్ట్ తో సంపూర్ణ పరిష్కారాలను అందించడానికి రెడీగా ఉన్నామని తెలిపారు. ఇక్కడే ప్రీమియం కేర్ అమలులోకి వస్తుందన్నారు. ప్రీమియం కేర్ మా క్లయింట్‌లు అమ్మకాల తర్వాత సపోర్ట్, సహాయం, సేవలను పొందేలా చేస్తుందన్నారు. మేము ప్రారంభించే ప్రతి ఉత్పత్తి, అందించే ప్రతి సర్వీసు మా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. సృజన్ 3.0 వారి జీవితాలను సుసంపన్నం చేయడంలో మా అంకితభావానికి నిదర్శనమన్నారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఇన్నోవేషన్’ వైపు ఈ ప్రయాణంలో మాతో చేరాలని కోరారు.