హైదరాబాద్: జనవరి 25 నుంచి జరుగనున్న భారత్, ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిచ్, అవుట్‌ఫీల్డ్, స్టాండ్స్, రూఫ్‌టాప్, కొత్త సీటింగ్, డ్రెస్సింగ్‌రూమ్స్ ఆధునీకరణ, శానిటేషన్ పనుల పురోగతిని హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావుతో కలిసి ఇతర ఆఫీస్ బేరర్లు పరిశీలించారు. ‘టెస్టు నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు ఉండేందుకు వీల్లేదు. పిచ్, అవుట్‌ఫీల్డ్ అత్యుత్తమ ప్రమాణాలతో ఉండాలి. మ్యాచ్‌కు వచ్చే అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని’ మైదాన సిబ్బంది, హెచ్‌సీఏ యంత్రాంగాన్ని జగన్‌మోహన్ రావు ఆదేశించారు.