గుండాలలో సీఐటీయూ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం

నవతెలంగాణ – గుండాల : గుండాల మండల కేంద్రంలో నేడు సీఐటీయూ మండల కార్యాలయం ప్రారంభం అవడానికి శనివారం రంగం సిద్ధం కాగా, దాన్ని ప్రారంభించడానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ, సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏ జే రమేష్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ జి.పద్మ నేడు ముఖ్య అతిథులుగా హాజరై, సీఐటీయూ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ అబ్దుల్ నబీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక వర్గ పోరాటాలలో  సీఐటీయూ ఎనలేని కృషి చేస్తుందని కార్మిక, శ్రామిక వర్గ ఐక్యతకు సీఐటీయూ అండదండలిస్తూ వర్గ పోరాటాలు నడపడంలో అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్నదన్నారు. గుండాల మండల కేంద్రములో కార్యాలయం ఉండటం వల్ల కార్మిక ఐక్యత కోసం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం కార్యాలయం ఏర్పాటుకు ముందు సన్నాహక సమావేశం వజ్జ సుశీల అధ్యక్షతన జరిగిన సభలో పాయం సారమ్మ, ఎం.డి నజ్మా, పూలమ్మ, పొంబోయిన లక్ష్మీ, కౌసల్య, ఉమా మహేశ్వరి, విజయలక్ష్మి, మొక్క సునీత, తదితరులు పాల్గొన్నారు.