ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ నిఘా సన్నాహక సమావేశం..

– బందోబస్తు పై సమాలోచనలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపధ్యంలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు,పలు అసాంఘిక కార్యక్రమాల నివారణ కోసం పటిష్ఠమైన నిఘా నిర్వహణకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్,తెలంగాణ డీజీపీ ఆదేశానుసారం గురువారం స్థానిక లహరి లాడ్జి లో పోలీస్ శాఖ అంతర్రాష్ట్ర పోలీస్ అధికారుల సన్నాహక సమావేశం నిర్వహించినట్లు పాల్వంచ డి.ఎస్.పి ఎన్.వెంకటేష్ తెలిపారు. అశ్వారావుపేట నియోజక వర్గం ఆంధ్ర ప్రదేశ్ కు సరిహద్దు కావడం తో ఆ రాష్ట్రంలోని అశ్వారావుపేట కు సరిహద్దుగా గా ఉన్న సర్కిల్,మండలాలు అధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎక్కడెక్కడ నిఘా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయాలి,ఏ విధమైన బందోబస్తు కల్పించాలి,ఎలా నిఘా నిర్వహించాలి నే రక్షణ చర్యలు పై సమాలోచనలు చేసారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లోని జంగారెడ్డిగూడెం,నూజివీడు డిఎస్పీ లు ఎం.ధనుంజయ్,ఈ.అశోక్ కుమార్,తెలంగాణ లోని  కల్లూరు ఏసిపి బి.రామానుజం,  పాల్వంచ, అశ్వారావుపేట, సత్తుపల్లి, జీలుగుమిల్లి, నూజివీడు రూరల్, చింతలపూడి, అశ్వారావుపేట ఎక్సైజ్ సీఐ లు వి.వినయ్ కుమార్, జే.మోహన్ బాబు, టి.కరుణాకర్, బి.వెంకటేశ్వరరావు, ఆర్.అంకబాబు, కే.నాగయ్య, ఎం.మల్లేశ్వరరావులుతో పాటు అశ్వారావుపేట -1, అశ్వారావుపేట -2, దమ్మపేట, ములకలపల్లి, వేంసూరు, బూర్గంపాడు, వేలేరుపాడు హాజరు అయ్యారు.