– భారత మహిళల జట్టు ప్రకటన
ముంబయి : మహిళల ఆసియా కప్ టీ20 వేటకు టీమ్ ఇండియా సిద్ధమైంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ అనంతరం నేరుగా శ్రీలంకకు బయల్దేరనుంది. శ్రీలంకలో జరుగనున్న 2024 ఆసియా కప్‌లో భారత్ మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం సమావేశమైన ఆల్ ఇండియా సీనియర్ మహిళల సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. హైదరాబాదీ అమ్మాయి, పేసర్ అరుంధతి రెడ్డికి జట్టులో చోటు లభించింది. ఆసియా కప్‌లో భారత్ జులై 19న తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. జులై 21న యుఏఈ, జులై 23న నేపాల్‌తో ఆడనుంది. గ్రూప్ దశ మ్యాచుల అనంతరం నాకౌట్ రౌండ్ ఆరంభం కానుంది.
భారత మహిళల జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రొడ్రిగస్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమ, పూజ వస్ట్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, హేమలత, ఆశ శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సంజన సంజీవన్. (రిజర్వ్ ప్లేయర్స్ : శ్వేత షెరావత్, సాయిక, తనుజ, మేఘన సింగ్).