స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి– సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
– సహాయ కార్యదర్శుల నియామకం
నవతెలంగాణ-రంగారెడ్ది ప్రతినిధి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కార్య కర్తలు సిద్ధంగా ఉండాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాల మాకుల జంగయ్య పిలుపునిచ్చారు. పార్టీ బలంగా ఉన్న అన్ని గ్రామాల్లో సీపీఐ సర్పంచ్‌, వార్డు మెంబర్లు, ఎంపీ టీసీలుగా పోటీ చేయాలని సూచించారు. ఇబ్రహీంప ట్నం, యాచారం, మంచాల మండలాల పార్టీ ముఖ్య కా ర్యకర్తల సమావేశం ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయం లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి కేంద్రీకరించాలాన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే వాటిని ఎండగట్టి, ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంద న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని త్వరలోనే నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజా పోరాటలకు సిద్ధం అవుతామన్నారు. స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉంటుందా..? ఉండదా..? అనేది పార్టీ నిర్ణయిస్తుందని, ఎవరికి వారు వ్యక్తిగతంగా పార్టీ నిర్మాణం కోసం కృషి చేసి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎన్నికలను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారి మాట్లాడుతూ.. గతంలో ఇబ్రహీంపట్నంలో సీపీఐ చాలా బలంగా ఉండేదని ఇక్క డి నుంచి సురవరం సుధాకర్‌ రెడ్డి, ధర్మ బిక్షం పార్లమెంటుకు నాయకత్వం వహించారన్నారు. వారి అడుగుజాడల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి పార్టీకి పూ ర్వ వైభవాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కావలి నరసిం హ, ముత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు పోచమోని నీలమ్మ, సీనియర్‌ నాయకులు శివరాల ల క్ష్మయ్య, చివరాల యాదయ్య, జంగిలి కృష్ణ, ములుగు నర సింహ, నీలం శివయ్య, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజునాయక్‌, తదితరులు పాల్గొన్నారు.
సహాయ కార్యదర్శుల నియామకం
ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం పార్టీ మం డల సహాయ కార్యదర్శిలను నియమించారు. ఇబ్ర హీంపట్నం మండల కార్యదర్శిగా ములుగు నరసింహ, మంచాల మండల కార్యదర్శిగా రాజు నాయక్‌, సహాయ కార్యదర్శులుగా మేకల రామకృష్ణ, గాలయ్యను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. యాచారం మండల కన్వీనర్‌ గా నీలం శివయ్య, కోకన్వీనర్‌గా మస్కు సంజీవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.