ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో వేల గొంతులు, లక్ష డప్పుల మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శన ఉందని మాదిగ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు ఇంటి నుండి డప్పు సంకన వేసుకొని పట్నం ప్రయాణంకు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ పిలుపునిచ్చారు. మహా సాంస్కృతిక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి నవీన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. మాదిగల చిరకాల స్వప్నం 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యంగా ఈ దేశంలో సుదీర్ఘంగా నడిచిన సామాజిక న్యాయమైన ఉద్యమ స్వరూపాన్ని అర్థం చేసుకొని గౌరవ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూ ఫిబ్రవరి 1 తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణను అమలు చేస్తామని రాష్ట్ర శాసనసభలో మాట్లాడి నేడు అమలు చేయడంతో జాప్యం చేస్తున్నారన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేసి 58 కులాలకు రావలసిన విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో వెనుకబాటుకు గురైన మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని వర్గీకరణను అమల్లోకి తీసుకువచ్చి.. మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణకు ముగింపు పలకాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నమన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సందూరి వినయ్ సాగర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గైక్వాడ్ సూర్యకాంత్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రాజేశ్వర్, తరుడి శ్రీను టౌన్ ఇంచార్జి మడిపల్లి మనోజ్, దర్శనాల పోచన్న, లక్ష్మణ్, కృష్ణ పెళ్లి అంకుష్, రోడ్డ గంగన్న, గజ్జల అశోక్, చెంచు రవి, నేరెళ్ల దినేష్ కోడిచెర్ల వేణు, మండలాల నాయకులు పాల్గొన్నారు.