నయా జోష్ తో ఎన్నికలకు సిద్ధం కావాలి

– అభివృద్ధి, సంక్షేమానికి తొలి ప్రాధాన్యత

–  ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
నయా జోష్ తో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో దోచుకో.. దాచుకో అనే సిద్ధాంతాన్ని అమలుజేస్తూ, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేసారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు. గ్రామాలు, తండాల్లో నెలకొన్న సమస్యలను సేకరిస్తున్నామని, ప్రాధాన్యత ఆధారంగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ధ్యేయమని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, సీనియర్ నాయకులు నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, మండల ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి సైదులు గౌడ్, తోటకూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, దుంపల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, మండల పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, బానోత్ సీతారాం నాయక్, సతీష్, నాయకులు గద్దల ఉప్పలయ్య, బెడద మంజుల, చిలుక సంపత్, చెరుకు సత్యం, ఆవుల మహేష్, రంగు అశోక్ తదితరులు పాల్గొన్నారు.