రాజులమ్మ జాతరకి రంగం సిద్ధం

The stage is set for the Rajulamma fairనాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి దర్శకత్వంలో గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను వైజాగ్‌లోని రామాటాకీస్‌ రోడ్డులోని శ్రీరామ పిక్చర్‌ ప్యాలెస్‌లో నిర్వహించిన గ్రాండ్‌ ఈవెంట్‌లో మేకర్స్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ,’ ఏడాదిన్నర నుంచి నా లైఫ్‌లో నిజమైన తండేల్‌ అల్లు అరవిందే. నేను జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. వైజాగ్‌ విషయానికి వస్తే .. ఏ సినిమా రిలీజ్‌ అయినా వైజాగ్‌ టాక్‌ ఏంటి అనేది కనుక్కుంటా. ఇక్కడ సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా ఆడాల్సిందే. ఈపాలి యాట తప్పేదేలేదు. ఫిబ్రవరి 7న థియేటర్లలో రాజులమ్మ జాతరే’ అని చెప్పారు. ‘మేము ఎంత కష్టపడి తీసినా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది. చందూ మొండేటి ఈ కథను అత్యద్భుతంగా మలిచి, చాలా బాగా తీశారు. సాయిపల్లవి అద్భుతంగా నటించారు. హీరో నాగచైతన్య ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో ఈ సినిమాలో నటించారు. కొన్ని సీన్స్‌ చూస్తే మన గుండె కరిగిపోయేలా నటించారు. ఈ సినిమాతో బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అనిపించుకుంటారు. దేవి శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ను చించిపడేశాడు. శ్రీకాకుళంలో ఒక చిన్న ఊళ్లో జరిగిన కథను సినిమాగా తీశాం. ఉత్తరాంధ్ర వాళ్లంతా ఈ సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది’ అని అల్లు అరవింద్‌ చెప్పారు.