నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే సమ్మెకు సిద్ధమవుతామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు అన్నారు. శుక్రవారం రోజున ఎంపీడీవో కార్యాలయం ముందు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు టోకెన్ సమ్మె చేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులు సంవత్సరాల తరబడిగా గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ పారిశుద్ధ్య కార్మికులుగా కారోబార్గా వాటర్ మిలన్ గా పనిచేస్తున్నారని ప్రభుత్వాలు మారిన పార్టీలు మారిన గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో చేతులు రావడంలేదని గత ప్రభుత్వం ఆయాంలో అనేక ఆందోళన పోరాటాలు చేస్తున్న సందర్భంలో నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం అసమార్థ ప్రభుత్వమని మీ సమస్యలు పట్టించుకోవడంలేదని అనేక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వచ్చి సంవత్సరం గా వస్తున్న ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదని చిత్తశుద్ధితో వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలు పెరుగుతున్న ధరలు కనుక్కోణంగా జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని ఐడెంటి కార్డులు ఇవ్వాలని గుర్తింపు కార్డు ఇవ్వాలని అధికారుల వేధింపులు ఆపాలని పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఆన్లైన్లో పేరు లేని కార్మికుల పేర్లను వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు బొల్లెపల్లి స్వామి నాయకులు ఐలయ్య శంకర్ ఎల్లేష్ కోటిష్ మహేందర్ అనిత పద్మ లు పాల్గొన్నారు.