ప్రేరణ మహోత్సవ్.. 

నవతెలంగాణ – భువనగిరి
ప్రేరణ మహోత్సవం కి సంబంధించిన డిస్టిక్ లెవెల్ కంపిటిషన్ నోడల్ స్కూల్ గా ఎంపికైన కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో నిర్వహించారు. కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ యన్ చంద్రమౌళి గారు తెలియజేసిన వివరాల ప్రకారం జిల్లాలోని 57 పాఠశాలలు ప్రేరణ ఉత్సవలో పాల్గొన్నాయి. ఇందులో భాగంగా ఒక్కొక్క స్కూల్ నుండి యిద్దరు విద్యార్థుల చొప్పున 111 విద్యార్థులు వివిధ కంపిటిషన్స్ లో పాల్గొన్నారని తెలిపారు. వ్యాసరచన పోటీలో 81, చిత్రలేఖనం పోటీలో 26, కవితల పోటీలో 4 పాల్గొన్నారని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎఎంఓ జె శ్రీనివాస్, ఎంత ఓ నాగవర్ధన్ రెడ్డి , వివిధ పాఠశాలల విద్యారుల ఎస్కాట్ టీచర్స్ మరియు కేంద్రీయ విద్యాలయ భువనగిరి ఉపాధ్యాయులు పాలోన్నారు.