దేశం ఉన్నతి కోసం, స్వాతంత్య్రం కోసం, రాజ్యాంగ నిర్మాణం కోసం త్యాగం చేసిన మహనీయుల చిత్రపటాలను, వారి జీవిత చరిత్ర గ్రందాలను ప్రతి ఇంటింటా చేర్చడమే లక్ష్యంగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 సొసైటీ జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్,కాళేశ్వరం జోనల్ యువత అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్ లు చేపట్టిన కార్యక్రమం మండలంలో కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం సొసైటీ మహిళ విభాగం భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు కొండ రాజమ్మ, కాటారం డివిజన్ అధ్యక్షురాలు కొండూరి మమతలు మండలంలోని కొయ్యుర్ ప్రెస్ క్లబ్ కు భారత రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ చిత్రపటాన్ని అందజేశారు.అలాగే సొసైటీ రైతు విభాగం భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్ర సారయ్య ఆధ్వర్యంలో అంబెడ్కర్ చిత్ర పటాలను పలువురుకి అందజేశారు.