కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీ రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి తరపున 10 వ తరగతి లో మండలం లో మొదటి రెండవ గ్రేడు పొందిన విద్యార్థులకు రచ్చ జగన్నాథ్ స్మారక ప్రతిభా పురస్కారాలు ఎస్సై విజయ్ కొండ చేతుల మీదుగా ప్రదానం చేశారు. 9.8 జిపిఏ సాధించిన మోడల్ పాఠశాల మేనూర్ విద్యార్థులు సుర్నార్ శివాని, శివ సేతన మరియు 9.2 గ్రే డు పొందిన రచ్చావార్ స్రవంతి లకు మెడల్, మేమెంటో, ప్రశంసా పత్రాలతో పాటు వేయి రూపాయల నగదు ను పురస్కారం గా మద్నూర్ సబ్ ఇన్స్పెక్టర్ కొండ విజయ్ మాజీ ఎంపిటిసి రచ్చ కుశాల్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాంపల్లి మల్లేశం, రాజేందర్, రచ్చ జగన్నాథ్ స్మృతి సమితి ప్రతినిధి రచ్చ శివకాంత్, ఉపాధ్యాయులు, బూతుల్, ఫాతిమా, షాయిన్ ఫాతిమా, భీమ్ తదితరులు పాల్గొన్నారు.