
శంకరపట్నం మండల పరిధిలోని మొలంగూర్ గ్రామానికి చెందిన భక్తుడు తుమ్మ రఘుపతి కుటుంబ సభ్యులు మొలంగూర్ గ్రామంలో పునః ప్రతిష్టాపన పురస్కరించుకొని కాకతీయుల కాలం నాటి శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి విగ్రహానికి ఒక కిలో వెండి రూ.85,000 వెయ్యిల రూపాయల విలువచేసే వెండి కిరీటాన్ని దేవాలయ కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం కు అందించారు. ఈ నెల 24నుండి జరగనున్న ప్రతిష్ట మహోత్సవంలోశ్రీ వీరభద్రస్వామి విగ్రహానికి ఈ కిరీటాన్ని అమర్చనున్నట్లు, ఆలయ అర్చకులు గోల్యాల గంగాధర్ తెలిపారు. గతంలో కూడా గ్రామంలో పోచమ్మ విగ్రహానికి వెండి కిరీటాన్ని బహుకరించినట్లు,తుమ్మ రఘుపతి తెలిపారు.