స్వర్ణ నంది అవార్డు బహుకరణ

నవతెలంగాణ – మోర్తాడ్

మండలం పాలెం గ్రామానికి చెందిన జ్యోతిష శర్మ రంజిత్ కుమార్ కు స్వర్ణ నంది అవార్డు పురస్కారం అందినట్లు తెలిపారు. డాక్టర్ కే విశ్వనాథ్ గారి 94వ జయంతి సందర్భంగా స్వప్న నంది పురస్కారంలో తన పేరుని ఎంపిక చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ కళానిలయంలో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు జడ్జి రాధా రాణి, మినిస్టర్ ఆఫ్ కల్చర్ డాక్టర్ ఎస్పీ భారతి సినీ నిర్మాతల చేతుల మీదుగా అవార్డును అందించినట్లు తెలిపార. స్వర్ణ నంది అవార్డుకు తన పేరును ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసినట్లు వేద జ్యోతిష్య శర్మ పండితులు సాహసం రంజిత్ కుమార్ తెలిపారు.