ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత..

నవతెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని కన్నాపూర్ తాండకు చెందిన గోగులోత్ మోతిరామ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందగా, సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద రూ, 16 వేల చెక్కును ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, సర్పంచ్ చందర్ నాయక్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భార్య లక్ష్మి కి అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముత్తినేని రవీందర్ రావు, బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు రంగు రవీందర్ గౌడ్, మండల రైతు బంధు అద్యక్షులు నారాయణరెడ్డి, జిల్లా డైరెక్టర్ రాజేందర్, ఉప సర్పంచ్ సర్మన్ నాయక్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తుపాకుల రాజేందర్ గౌడ్, గ్రామ అధ్యక్షులు శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.