సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత 

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
 హుస్నాబాద్ మండలంలోని గాంధీ నగర్. కుచనపల్లి. పందిళ్ళ. పొట్లపల్లి .మడుద. మహమ్మదాపూర్ .పోతారం. జిల్లెల గడ్డ. మీర్జాపూర్. తోటపల్లి .గ్రామాలలో శనివారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చందు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలలో వైద్యం చేసుకున్న వారికి చేదోడుగా ఉండేలా సీఎం రిలఫ్ ఫండ్ అందజేసినట్లు తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నరాజు, పొతుగంటి బాలయ్య, సంఘ కుమార్, తైలం విక్రమ్ ,గట్టు రాములు, బొంగోని శ్రీనివాస్,  పోలు సంపత్, మడప యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.