
ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స చేయించుకోగా,వారందరికీ కలిపి 2 లక్షల 40 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కుల రూపంలో రావడంతో …జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్,కాంగ్రేస్ నాయకులు కలిసి బాధితుల ఇంటి వద్దకు వెళ్ళి, గురువారం చెక్కులను వారికి అందించారు. ఈ సందర్భంగా శివన్నోళ్ళ శివకుమార్ మాట్లాడుతూ….బాల్కొండ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి కృషితో బాధితులకు డబ్భులు మంజూరయ్యాయని అన్నారు.అనంతరం బాధితులు సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి,నాయకులు ముస్కు మోహన్,పన్నాల నర్సారెడ్డి,బద్దం లింగారెడ్డి,రొక్కెడ చిన్న సాయన్న,బొర్రన్న,కల్లెడ పురుషోత్తం,మేర్గు సురేష్ తదితరులు పాల్గొన్నారు.