బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి నాగలి బహుకరణ

– కొత్త ప్రభాకర్ రెడ్డినీ కలిసిన పోతరెడ్డి పేట బీఆర్ఎస్ కార్యకర్తలు
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ 
సిద్దిపేట జిల్లా నూతన అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మహిళ కార్యకర్తలు మెదక్ ఎంపీ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కి టేకు కట్టేతో చేసిన నాగలిని బహుకరించారు. గురువారంఅక్బర్ పేట్ భూంపల్లి మండల కేంద్రంలో మిరుదొడ్డి, అక్బర్ పేట్ భూంపల్లి ఇరు మండల పార్టీ బీఆర్ఎస్ భూత్ అధ్యక్షులకు మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్బీఆర్ గార్డెన్ లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరైన పోతరెడ్డిపేట బీఆర్ఎస్ గ్రామ కార్యకర్తలు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉన్నహొ టీఆర్ఎస్హొ పార్టీ ని జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా హోదా పొంది ఢిల్లీలో పార్టీ భవనాన్నిహొస్థాపించిందన్నారు.రైతుల మేలు కోసం పని చేయాలనే సిద్ధాంతంతో ముందుకు వెళ్తూ… నూతన అక్బర్ పేట్ భూంపల్లి మండల రైతులమేలు కోసం తాజాగా నిధులు మంజూరు చేసిన సందర్భంగా రైతుల పక్షాన ఎంపీకి నాగలిని బహూకరించామన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ చేసి వారీ మెప్పు పొందిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్హొ మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రవీందర్,హొజ్యోతి కృష్ణ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్,ఎంపీటీసీ చంద్రసాగర్, నాయకులు చింతల కృష్ణ, దమ్మగౌని ప్రశాంత్ గౌడ్, రవి చారి, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్,దమ్మగౌని ప్రవీణ్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు యాదగిరి, మహిళ కార్యకర్తలుహొ తదితరులు ఉన్నారు