సి అండ్ ఎండికి వినతి పత్రం అందజేత 

నవతెలంగాణ – రామగిరి 
సింగరేణి  సి అండ్ ఎండి  బలరాం నాయక్ కి కాంట్రాక్టర్ల సమస్యలపై ఆర్జి-3 ఏరియాకి సంబంధించిన కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ.. ఆర్జి-3 కాంట్రాక్టర్స్  తాము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కాంట్రాక్ట్ కార్మికుడు డ్యూటీకి రాకపోతే ఆ పెనాల్టీని, కాంట్రాక్టర్ బిల్లు నుండి రికవరీ చేసే విధానం రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా సివిల్ వర్క్స్ సంబంధించిన ఎస్.ఆర్ 2021-22 రిలీజ్ చేసి ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయ్యిందని సంవత్సరానికి ఒక్కసారి చొప్పున ఎస్.ఆర్ రిలీజ్ చేయగలరని, వినతి పత్రంలో పేర్కొన్నామన్నారు. పై సమస్యలపై సింగరేణి సి అండ్ ఎండి సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంట్రాక్టర్స్  వనం రామ్ చందర్ రావు,టి కృష్ణ, ఎరుకల ఓదెలు, నాడెం సమ్మయ్య, నాడెం శంకర్, కనుకుల శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.