సంక్షేమ హాస్టళ్ళ సంరక్షణ .. విద్యారంగ పరిరక్షణకై  పోరు యాత్ర

Preservation of welfare hostels– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ 
– సెప్టెంబర్ 2నుంచి 6వరకు జరిగే ఎస్ఎఫ్ఐ మోటర్  సైకిల్ యాత్ర ను  జయప్రదం చేయాలనిపిలుపు 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
సంక్షేమ హాస్టల్  సంరక్షణ.. విద్యారంగ పరిరక్షణ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు నిర్వహించే మోటార్ సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ పిలుపునిచ్చారు.ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం సంక్షేమ హాస్టల్లో సంరక్షణ ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కై ఎస్ఎఫ్ఐ పోరు యాత్ర  కరపత్రం ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుండి 6 వరకు జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో కస్తూరిభ పాఠశాలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ పోరు యాత్ర నిర్వహిస్తుందన్నారు. ఈ పోరు యాత్ర సెప్టెంబర్ 2న మునుగోడు నియోజకవర్గం చండూరు లో ప్రారంభమై నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు, గురుకుల విద్యార్థులకు,  కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని  అన్న మాటలు నీటీ మూటలుగా మారిపోతున్నాయని విమర్శించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి సంక్షేమరంగంపై సవతి తల్లి ప్రేమ చూపించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగం పై  ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ హాస్టల్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు, గురుకుల పాఠశాల విద్యార్థులు రోజుకు 33 రూపాయలు 55 పైసలతో మూడు పూటల భోజనం ఏ విధంగా సాధ్యమైతుందని ప్రశ్నించారు. అంటే 7వతరగతి లోపు‌ విద్యార్థులకు నెలకు 850రూపాయాలు 8వ‌తరగతి నుండి 10వ‌తరగతి   విద్యార్థులకు 1050రూపాయలతో నెల రోజులు ఏ విధంగా   భోజనం సాధ్యం అవుతుందో  చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు గురుకుల పాఠశాల విద్యార్థులకు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులకు సోంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై నల్లగొండ జిల్లా  వ్యాప్తంగా చేపట్టనున్న   మోటార్ సైకిల్ యాత్ర లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర వ్యాప్తంగా బకాయిలో  వున్నా 8250కోట్ల స్కాలర్ షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని,  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వున్న ఏకైక  యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కీ అధీక నిధులు కేటాయించి  యూనివర్సిటీ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని  అన్నారు.నల్లగోండ జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్ల సంరక్షణ విద్యారంగ పరిరక్షణకై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాడుతుందని విద్యార్థులకు  అండాగా  భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ   వుంటుందని  అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర  గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్య,నల్లగొండ డివిజన్ ఉపాధ్యక్షులు కిరణ్, మునుగోడు డివిజన్ నాయకులు సన్ని, స్పందన, మనిషా,కల్పన, రాధిక, స్వప్న, సుందరి, కవిత, తదితరులు పాల్గొన్నారు.