
మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రం ఆవరణలో టీఎస్ టీటీఎఫ్ నూతన సంవత్సరం 2024 వాల్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక విద్యాశాఖాధికారి పి.కృష్ణయ్య చేతుల మీదుగా శనివారం జరిగిందని ఆ సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇస్లావత్ నరేష్, ఆంగోత్ రమేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భూక్యా రమేష్, ఆళ్ళపల్లి, మర్కోడు, అనంతోగు కాంప్లెక్స్ హెచ్.ఎంలు కె.శాంతరావు, బానోత్ బాబులాల్, బి.బావుసింగ్, ఎమ్మార్సీ సిబ్బంది, మిత్ర సంఘాల నాయకులు, సీ.ఆర్.పీ సునీత, తదితరులు పాల్గొన్నారు.