నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌ వస్తున్నారు. ఇక్కడ జరిగే అల్లూరి సీతారామారాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొంటారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆమె మాట్లాడతారు. అనంతరం 5వ తేదీ మహారాష్ట్రలోని గోండ్వానా విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తారు. అనంతరం నాగ్‌పూర్‌లోని కోరడిలో భారతీయ విద్యాభవన్‌ సాంస్కృతిక కేంద్రాన్ని ప్రారంభిస్తారు.