
ముత్తారం మండలం అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మారం రాధమ్మ ఇటీవల మరణించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి జరిగిన దశదిన కర్మలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గన్నారు. మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్త పరిచారు. కార్యక్రమంలో నాయకులు లక్కం ప్రభాకర్, ఉప్పు శంకర్, నిమ్మతి రవి, తోట సమ్మయ్య, మాదాసి రవి, యూత్ నాయకులు లక్కం రాజు, అంబటి కుమార్ యాదవ్ తదితరులున్నారు.