
చౌటుప్పల్ పి ఎస్ సి ఎస్ మాజీ అధ్యక్షుడు చింతల దామోదర్ రెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గోదాం బిల్డింగ్ నిర్మాణం,సిబ్బందిని నియమించిన వాటిపై నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ప్రతి అంశంపై అందరి సభ్యులతో తీర్మానం చేయడం జరిగింది. దాతల సహాయంతో ఆడిటరోరియం,67లక్షలతో తీర్మానం చేయడం జరిగింది అని అన్నారు.మొత్తం 13 మంది కమిటీ సభ్యుల ద్వారా ఈ సొసైటీ తీర్మానం జరిగింది అని తెలిపారు.అదనపు సిబ్బందికి డీసీసీబీ అకౌంట్ ద్వారా వారికీ చెల్లింపులు చేయడం జరిగింది తెలిపారు.ఉద్దేశ పూర్వకంగానే నాపై కుట్ర చేశారని చెప్పారు. రాజకీయ కారణంగా నన్ను సస్పెండ్ చేశారని దామోదర్ రెడ్డి త్రీవ ఆవేదన వ్యక్తం చేశారు.8 కొట్ల నుండి 10 కొట్ల వరకు సొసైటీని విస్తరణ చేశానని అన్నారు.కాంగ్రెస్ పార్టీలోకి రాకపోవడంతో ఇలాంటి అభియోగాలు మోపారు,దీనిపై అధికారులు పిర్యాదు చేస్తాను అని చింతల దామోదర్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు.13 మంది సభ్యులు ఉన్నా సొసైటీలో 12 మంది సభ్యులు నాతో వున్నారు.అధికార పలుకుబడితో నాకు నోటీసులు ఇచ్చారు.అభివృద్ధి కోసం పాటు బడిన నన్ను ఇలా చేయడం భావ్యం కాదు అని దాామోదర్ రెడ్డి అన్నారు.నా మీద మోపిన ఆరోపణలు సంబందించిన అంశాలపై అధికారులకు వివరణ ఇచ్చాను.అందరికి నిజం తొందరలో తెలుస్తుంది అని మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.