పేటియం షేర్లపై ఒత్తిడి..

న్యూఢిల్లీ : రూ.50,000 లోపు ఉండే వ్యక్తిగత రుణాల జారీని తగ్గించుకుంటామని పేటియం ప్రకటించింది. ఇకపై కేవలం పెద్ద రుణాలపైనే దృష్టి సారిస్తామని ఆ సంస్థ బుధవారం తెలిపింది. అదే విధంగా ఇప్పుడు కొనండి-తర్వాత చెల్లించండి వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తామని వెల్లడించింది. ఈ పరిణామం గురువారం పేటియం షేర్లను భారీగా నష్టపోయేలా చేసిందిజ ఇంట్రాడేలో 20 శాతం నష్టపోయి బిఎస్‌ఇలో రూ.650 కనిష్ట స్థాయికి దిగజారిన సూచీ.. తుదకు 18.69 శాతం నష్టంతో రూ.661.30 వద్ద ముగిసింది. పేటియం లిస్టింగ్‌ తర్వాత ఒకే పూటలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. వ్యక్తిగత రుణాల జారీని కఠినతరం చేస్తూ ఇటీవల ఆర్‌బిఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పేటియం తన విధానాన్ని మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది.