బాల్య వివాహాలను అరికట్టాలి

దేశంలో బాల్య వివాహాలను అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు నేటికీ ఫలించడం లేదు. బాల్య వివాహాల నిరోధ చట్టం ఉన్నా, వాటిన అరికట్టేందుకు ఎన్ని విధానాలు రూపొందించినా, సామాజిక అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదంటే ఇది ముమ్మాటికీ పాలకుల నిర్లక్ష్యమే. ఎందుకంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ 2023-24లో విడుదల చేసిన నివేదికను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఏడాది దేశంలో దాదాపు పదకొండు లక్షల మంది మైనర్‌లకు వివాహాలు జరిపినట్టు నివేదిక తెలిపింది. ఈఏడాది ముగియడానికి మరో రెండు నెలల సమయం కూడా ఉన్నది. అంటే ఈ కాలంలో మరెన్ని వివాహాలు జరిగుంటాయో చెప్పనక్కర్లేదు! ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బాల్య వివాహాలను నిరోధించేందుకు గాను సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను సూచిం చింది. ప్రతి జిల్లాకు బాల్య వివాహాల నిరోధక అధి కారి ఉండాలని, మైనర్‌ వివాహం జరగబోతుందన్న విషయం తెలిసినా, అనుమాన మొచ్చినా పోలీ సులు, అధికారులు, కలెక్టర్లు జోక్యం చేసుకో వాలని ఆదేశించింది. ముఖ్యంగా సామూ హిక వివాహాలు జరిగే శుభ దినాలలో, జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్లు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ఎవరైనా బాల్యవివాహాన్ని చేయడం, లేదా ప్రోత్సహించడం, నిరోధించకపోవడం, ఉన్నతాధికా రులకు సమాచారం ఇవ్వకపోవడం చేస్తే గనుక విచారణ ద్వారా చర్యలు చేపట్టాలని పేర్కొంది. అయితే ఇన్ని కఠినమైన నిబంధనలు, పర్యవేక్షించే అధికారులు ఉన్నప్పటికీ బాల్య వివాహాలు ఆగకపోవడం విచారించదగ్గ అంశం.ఇది కచ్చితం గా అధికార యంత్రాంగం పట్టించుకోక పోవడం వల్లేనని విమర్శలు కూడా వ్యక్తమవు తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మైనర్‌ వివాహాల రేటు అత్యధికంగా ఉందని నివేదిక ద్వారా తెలిసింది. ఇది బాల్య వివాహాల నిషేధ చట్టం- 2006 వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్నది. దీనికి ప్రధానమైన కారణం, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థోమత లేని తల్లిదం డ్రులు తమ కూతుళ్లను చదివించలేకవడం, ప్రాథ మిక విద్య తర్వాత స్కూల్‌ మాన్పించడం, ఉన్నత విద్యకు ఇతర ప్రాంతాలకు పంపేందుకు సుము ఖంగా లేకపోవడం, అలాగే ఆడపిల్లలకు బయట భద్రతలేని పరిస్థితులు ఉండటం బాల్య వివాహా లకు తోడవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ దాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. బాల్యవివాహాలు పెరుగుతున్న సందర్భంగా పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వాలు బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుని పట్టణాల వరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకెళ్లి బాల్య వివాహాలు ఎలాంటి నష్టాన్ని కలగజేస్తాయో వివరించగలగాలి.
– ఆర్‌.సి.ఆర్‌