మాతాశిశు మరణాలను అరికట్టాలి

– గర్భిణలకు న్యూట్రీషన్‌ కిట్లు
– అందుబాటులోకి ప్రజా ఆరోగ్య కేంద్రాలు
– వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మాతాశిశు మరణాలు అరికట్టేందుకు ప్రభుత్వ ప్రత్యే క చర్యలు తీసుకుంటుందని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గర్భిణులకు న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్‌ విభాగం అధికా రులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశా లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఇప్పటికే తొమ్మిది జిల్లాలలో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించే హెల్త్‌ డే రోజున మిగతా 24 జి ల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో అట్టహా సంగా న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలిగా మని, మాతాశిశుమరణాలను అరికట్టడంలో తెలంగాణ దేశంలోనే మూడవ స్థానంలో ఉందన్నారు. న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ కార్యక్రమం కూడా మంచి ఫలితాలను అందిస్తుందనే నమ్మకం ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణాల ప్రగతి గురించి మంత్రి జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సొంత భవనాలు మంజూరు చేసినందున, వాటి నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే నిర్మాణాలు చేపట్టిన చోట నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. రం గారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌ మాట్లాడుతూ రంగారెడ్డి జి ల్లాకు 81 బస్తీ దవాఖానాలు మంజూరు అయిన వని, అం దులో 59 బస్తీ దవాఖానాలను వినియోగంలోకి తీసు కొచ్చామని, 6 బస్తీ దవాఖానాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, 5 బస్తీ దవాఖానాల పనులు పురోగతిలో ఉ న్నాయని వివరించారు. 71 పల్లె దవాఖానాలు మంజూరు అయినవని, అందులో 35 పల్లె దవాఖానాలకై స్థలాన్ని గుర్తించామని, 36 పల్లె దవాఖానాలకై స్థలాన్ని గుర్తించి సాధ్యమైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.వెంకటేశ్వర్‌ రావు, సంబంధిత వివిధ విభాగాల ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.