
అక్రమంగా మట్టి తవ్వకాలపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేట కు చెందిన ఒక వ్యక్తి గుర్రాల చెరువు గ్రామ సమీపం నుండి ఎటువంటి అనుమతులు లేకున్నా అక్రమంగా మట్టి తరలిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ఒక జే.సీ.బీ తో పాటు 5 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుకున్న వారి వాహనాలను రెవెన్యూ అధికారులకు అప్పగించ నున్నట్లు ఎస్.ఎచ్.ఒ ఎస్సై శ్రీరాముల శ్రీను తెలిపారు.