
నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండలం సెంటనరికాలనీకి చెందిన భద్రకాళీ ఉపాసకులు, ఆగమశాస్త్ర కోవిధులు డాక్టరేట్ గ్రహిత సముద్రాల విజయసారథి-మాధవి జంటకు అనురాగ దంపతుల పురస్కారం-2024 అవార్డును హైద్రాబాద్ చిక్కడపల్లి లోని సాంస్కృతిక కార్యక్రమాల వేదిక శ్రీ త్యాగరాజ గాన సభలో బుధవారం ప్రధానం చేయడం జరిగింది. శిఖరం ఆర్ట్ థియోటర్స్ హైద్రాబాద్ వారు అన్యోన్యంగా ఉంటూ ఉమ్మడి కుటుంబాలకు, ప్రతికగా ఉన్న ఐదు నుండి పది జంటలకు రెండు సంవత్సరాలకొకసారి ఈ అవార్డును ప్రధానం చేస్తారు. అనురాగానికి మరింత స్ఫూర్తిగా రాబోయేరోజుల్లో మరింత అన్యోన్యంగా, అనురాగంగా ఉండాలనే కాంక్షతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వహకులు కృష్ణ తెలిపారు. ప్రముఖ రంగస్థల నటులు, యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్వ కేంద్ర మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాలాచారి, ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు, హారతి సామ్రాట్ శివనరసింహన్, సామాజిక వేత్తలు డాక్టర్ కొత్త కృష్ణవేణి-శ్రీనివాస్ దంపతులు గార్ల చేతుల మీదుగా మాధవి-విజయసారథి దంపతులు ఈ అవార్డును అందుకున్నారు.అనురాగ దంపతులకు అందజేసిన ముత్యాల దండలను మార్చుకుని, దంపతులిరువురికి తలపై కిరీటాలు ధరింపి, శాలువాకప్పి, అవార్డు జ్ఞాపికఅందజేసి ఘనంగా సన్మానించారు. ఈ అవార్డుకు ఎంపికైన మాధవి-విజయసారథి దంపతులను పలువురు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.