– ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు- గమనం-గమ్యం
– చర్చా వేదికలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-దేవరకొండ
ప్రాథమిక విద్య ప్రయివేట్ లేకుండా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు- గమనం- గమ్యం అనే అంశంపై జరిగిన చర్చావేదికలో ఆయన మాట్లాడారు.ప్రతి ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి, ఫ్రీ ప్రైమరీ ఉపాధ్యాయులను ఇవ్వాలని, విద్యాహక్కు చట్టంలో ప్రాథమిక పాఠశాలలకు ,విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా హైస్కూల మాదిరిగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, స్కాం రేంజర్ కం అటెండర్ ఉండే విధంగా మార్పు చేస్తూ సిబ్బందిని కేటాయించాలన్నారు.1వ తరగతి నుండి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్టులు సిలబస్ మార్పు చేయాలని డిమాండ్‌చేశారు.ప్రయివేట్ పుస్తకాల మాదిరిగా రైమ్స్, చిత్రాలు, అభ్యాస కత్యాలు అనుకూలంగా మార్పు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు పరిపూర్ణ సాంకేతిక శిక్షణ, ప్రతి ప్రాథమిక పాఠశాలకు తగు సాంకేతిక పరికరాలను ఫర్నిచర్, ఇతర సౌకర్యాలు కల్పిస్తూ తరగతి ఒక గది, ఆటస్థలం ఉండాలన్నారు .పేద ,ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఒకే రకమైన పాఠశాలలో అభ్యసించాలని,సిలబస్ కూడా ఒకటే ఉండాలన్నారు .ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బలోపేతానికి చేయాల్సిన అంశాలపై చర్చించారు.అనంతరం టీఎస్‌యూటీఎఫ్ సభ్యులు అనుముల పూరి రేణుక ఇటీవల మతి చెందినందున ఎఫ్‌డబ్ల్యూఎఫ్ నుండి 6 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు .ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎడ్ల సైదులు, పెరుమాళ్ళ వెంకటేశం, రాష్ట్ర సాంస్కతిక కమిటీ కన్వీనర్ నల్లనర్సింహ, ఎస్‌జీటీ ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరందాసు రామదాసు, జిల్లా ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్ గ్యార నర్సింహ, జిల్లా కార్యదర్శి తావూరియా, సతీష్, చిన్న ముత్యాలు,టీటీడబ్ల్యూ ఆర్‌జేసీ బాలుర కళాశాల ప్రిన్సిపాల్ రఘుపతి, హరేందర్‌రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.