పెద్దవంగరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 

– రూ. 1.43 కోట్ల నిధులు మంజూరు

– జీవో 354 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం 
నవతెలంగాణ పెద్దవంగర: మండలంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ ఆరోగ్య శాఖ ద్వారా జీవో నెంబర్ 354 విడుదల చేసింది. 2023-24 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ. 1.43 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మండలంలో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభించనున్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.