
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగలకు మాదిగ ఉప కులాలకు న్యాయం చేస్తామని అద్వానీ రథయాత్ర నుండి మొదలుకొని కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ తో పాటు ఈనాటి గౌరవ మంత్రివర్యులు కిషన్ రెడ్డి కూడా అనేక సభలు సమావేశాల్లో హామీ ఇవ్వడం జరిగింది చాలా సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న బిజెపి పార్టీ వర్గీకరణ విషయం మర్చిపోవడం జరిగింది రేపు నిజామాబాద్ సభలో వర్గీకరణ విషయంపై ప్రకటన చేయాలని ప్రధానమంత్రి ని కోరుచున్నామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేణికుంట నాంపల్లి తెలిపారు. వర్గీకరణతోనే మాదిగ మాదిగ ఉప కులాలు అభివృద్ధిలోకి వస్తాయని నాంపల్లి తెలిపారు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జ్ సల్లూరి శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు గుండారం మోహన్ బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ మోతే భూమన్న డిచ్పల్లి మండల అధ్యక్షుడు చిన్న సాయిలు నిజాంబాద్ రూరల్ మండల అధ్యక్షుడు తెడ్డు సాయిలు గంగమని కిరణ్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.