నవతెలంగాణ-షాబాద్
ప్రజాస్వామ్యం, ఓటు విలువలపై అవగాహన కలిగి ఉండాలని సర్దార్ నగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సర్దార్‌నగర్ ఉన్నత పాఠశాలలో ప్రజాస్వామ్యం, ఓటు విలువ అనే అంశంపై విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ఓటు హక్కు గురించి విద్యార్థులకు అవగాహన పెంపొందించేందుకే ఈ నమోన ఎన్నికలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, ఓటు హక్కు వినియోగిం చుకునే విధానం, ఎన్నికల విధుల్లో పాల్గోనే సిబ్బంది తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుశీల, జంగయ్య విద్యార్థులు పాల్గొన్నారు.