విద్యార్థులు ఆధునిక నైపుణ్యాలను అలవర్చుకోవాలి: ప్రిన్సిపాల్ సుధారాణి

నవతెలంగాణ కంటేశ్వర్ 

తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో వృత్తి విద్య కోర్సులో భాగంగా, దసరా సెలవుల్లో ఇంటెన్షిప్ లో పాల్గొన్న ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులకు జక్రాన్ పల్లి ఆదర్ష పాఠశాల లో సర్టిఫికెట్స్ అందజేశారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ సుధారాణి మాట్లాడుతూ.. కళాశాలలో ఉన్న విద్యతో పాటు నైపుణ్యాన్ని పెంచే వోకేషనల్ కోర్సులైన మల్టీ మీడియా అప్పారాల్ క్రీడలను జక్రాన్ పల్లి ఆదర్శ కళాశాలలో చాలా విజయవంతంగా నడిపిస్తున్నామని, అందులో భాగంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు క్షేత్రస్థాయిలో జరిగే పని నైపుణ్య విలువలను తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఇంటెన్సిటీ ప్రోగ్రాం ని విజయవంతంగ చేసి ఆ ఇంటెన్షిప్లో జరిగినటువంటి వారి అనుభవాలను నేడు మనతో పంచుకోవడం, అలాగే విద్యార్థులుచూపించిన నైపుణ్యతను గుర్తించి గవర్నమెంట్ ప్రతిభా సర్టిఫికెట్స్ ను ఇవ్వడం అనేది సంతోషించదగిన విషయం అని అన్నారు.
          అలాగే స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి సురేంద్ర మాట్లాడుతూ.. పిల్లలు క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడ జరిగే వర్కును అబ్సర్వ్ చేస్తే చెప్పేదానికంటే చూసి నేర్చుకునేది చాలా ఎక్కువగా అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఒకేషనల్ స్టేట్ కోఆర్డినేటర్ సురేంద్ర, కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, ఒకేషనల్ ట్రైనర్స్ సురేష్, స్వాతి, కంచరి రవికుమార్ కళాశాలలోని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.