జన్నారం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉన్న వివిధ కోర్సులలో మూడవ దశ ప్రవేశానికి గడువును పొడిగించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రావు తెలిపారు. కళాశాలలోని వివిధ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 17 వరకు పొడిగించిందన్నారు. తగిన, ఆసక్తి అర్హత గల విద్యార్థులు ప్రభుత్వ ఐటిఐ వెబ్సైట్లో ఆన్లైన్లో నిజ ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.