నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే 2024-25 విద్యాసంవత్సరానికిగాను ఎనిమిది నూతన మెడికల్ కాలేజీలకు ఇంఛార్జి ప్రిన్సిపాల్స్‌ను నియమించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యవిద్య సంచాలకురాలు డాక్టర్ త్రివేణి ఆదేశాలు జారీ చేశారు. కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఉస్మానియా మెడికల్ కాలేజీ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ వి.మురళీకృష్ణ, యాదాద్రి మెడికల్ కాలేజీకి గాంధీ మెడికల్ కాలేజీ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ పి.శ్రవణ్ కుమార్ ఇంఛార్జి ప్రిన్సిపాల్స్‌గా నియమితులయ్యారు. వీరితో పాటు నర్సంపేట, నారాయణపేట, ములుగు, మెదక్, మహేశ్వరం, జోగులాంబ గద్వాల ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఇంఛార్జ్ ప్రిన్సిపాళ్లను నియమించారు.