తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని నిజామాబాద్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నారాయణ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పి.ఎస్ ఆవరణంలో శనివారం వివిధ కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపల్స్, స్కూలుకు సంబంధించిన హెడ్మాస్టర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనర్ పిల్లలు ఎవరైనా బైక్ మీద వస్తే రానివ్వ వద్దని ,వారిని స్కూల్స్ వద్ద దింపడానికి తీసుకువెళ్లడానికి మైనర్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే స్కూల్ ఆవరణలోనికి అనుమతించవద్దని, అలాగే కాలేజ్ స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ చేస్తూ కాలేజీ కి వస్తే రానీయకూడదని, పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు స్పష్టంగా పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలని, అందరూ విధిగా బైక్ నడిపే వారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని, మొబైల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయవద్దని అలుసూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏ.సి.పి నిజామాబాద్ టి. నారాయణ, ట్రాఫిక్ సి.ఐ వి.వెంకటనారాయణ, బోధన్ ట్రాఫిక్ సి.ఐ చందర్ రాథోడ్, ఎస్సై రహమతుల్లా, ఆర్.ఎస్.ఐ సుమన్ ,చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.