ప్రధానోపాధ్యాయులు రాములుపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి..

Principals should severely punish the thugs who attacked Ramu..– టిఎస్యుటిఎఫ్  రాష్ట్ర ఆడిట్ కమిటీ  సభ్యులు కొర్ర శంకర్
నవతెలంగాణ – అచ్చంపేట
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం జెడ్ పి హెచ్ ఎస్ తుక్కుగూడ ప్రధానోపాధ్యాయులు రాములుపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని ఎస్.యు.టి.ఎఫ్  రాష్ట్ర ఆడిట్ కమిటీ  సభ్యులు కొర్ర శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల అచ్చంపేటలో టి.ఎస్.యు.టి.ఎఫ్  మండల అధ్యక్షులు సూర్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆడిట్ కమిటీ  సభ్యులు కొర్ర శంకర్ మాట్లాదారు.  డిసెంబర్ 29 న ఎఫ్ఐ ఆర్ నెo 682/2024 నమోదు అయిందని ఇప్పటివరకు  పోలీసులు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఇటీవల అనేక సందర్భాల్లో ఉపాధ్యాయులపై దాడి పరిపాటిగా మారిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, పాఠశాలలను కుల మత, వర్గ రహిత కేంద్రాలుగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు స్వేచ్ఛగా పాఠాలు చెప్పే విధంగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  గోపాల్,  ఎస్ టి యు, జిటిఏ నాయకులు బ్రహ్మేంద్ర యాదవ్, శ్రీలత, యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ, స్వామీ లాల్ , చంద్రకళ, మౌనిక, రవి,ఉపాధ్యాయులు ఈశ్వరయ్య, హలీమాబేగం, తదితరులు పాల్గొన్నారు.