పాఠశాలకు ప్రింటర్ బహూకరణ…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని యూపీఎస్ గౌస్ నగర్ పాఠశాలకు ఆర్మీలో పనిచేసే కొంత వెంకటరామిరెడ్డి సుమారు 25 వేల రూపాయల విలువగల ప్రింటర్ ను ఆ పాఠశాల  ప్రిన్సిపల్ సైదాకు బహుకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాజీ ఉపసర్పంచ్ పాక వెంకటేష్ యాదవ్, గ్రామస్తులు చీరక మల్లారెడ్డి, గడసందుల  రవీందర్, అరిగే శంకర్, బండ బిక్షపతి, కొమ్ము మల్లయ్య, పల్లెర్ల  శంకర్ , పాఠశాల ఉపాధ్యాయులు గడ్డమీది పాండు, చాట్ల సుధాకర్ లు పాల్గొన్నారు.